Karimnagar: కోర్టు మంచి నీటి రిజర్వాయర్‌ను పరిశీలించిన కమిషనర్ ప్రఫుల్

Karimnagar: కరీంనగర్ నగరంలోని కోర్టు మంచి నీటి రిజర్వాయర్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 16 July 2026 9:07 AM IST
Karimnagar
X

Karimnagar: కోర్టు మంచి నీటి రిజర్వాయర్‌ను పరిశీలించిన కమిషనర్ ప్రఫుల్

కరీంనగర్: నగర ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా నగరపాలక సంస్థ నిరంతరం పని చేస్తోందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. నగరంలోని కోర్టు మంచి నీటి రిజర్వాయర్‌ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. రిజర్వాయర్ పరిధిలో గల ఏఈ కార్యాలయంపై నూతనంగా నిర్మిస్తున్న రెండవ అంతస్తు భవన నిర్మాణ పనులను తనిఖీ చేసి పరిశీలించారు.

చివరి దశ పనులను త్వరగా పూర్తి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంచి నీటి రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి మంచి నీటి సంపు, మోటారు పంపుల పనితీరును పరిశీలించారు. నగరంలోని ఏయే ప్రాంతాలకు ఏ విధంగా తాగునీరు సరఫరా అవుతుంది అనే విషయం పై అధికారులను సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పరిసరాల్లో పెరిగిన కలుపు మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

​ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ప్రజల త్రాగు నీటికి ఇబ్బందులు రాకుండా సమయం ప్రకారం నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్ పరిసరాల్లో పెరిగిన కలుపు మొక్కలను తక్షణమే తొలగించి, ఆవరణ మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మంచి నీటి సంపు, మోటార్ పంపుల షెడ్డు చుట్టు పరిసరాలు శుభ్రంగా కనిపించేలా సిమెంట్ ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నగరపాలక సంస్థ కు చెందిన మంచి నీటి ట్యాంకర్లు ఇతర వాహానాల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మాణం కు తగిన చర్యలు తీస్కోవాలని... దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్దం చేసి..పనులు ప్రారంభించేలా చర్యలుై తీస్కోవాలని సూచించారు. ప్రజల మంచి నీటి సరఫరా విషయంలో సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సతీష్, వర్క్ ఇన్ స్పెక్టర్ పర్షరాములు, రిజర్వాయర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story