Karimnagar: నకిలీ ఓట్లకు చెక్.. కరీంనగర్‌లో పకడ్బందీగా ‘ఎస్ఐఆర్’ సర్వే: మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కీలక ప్రకటన!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనే ధ్యేయంగా సాగుతున్న ఎస్ఐఆర్ (SIR) సర్వేను విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ రాజకీయ పార్టీలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Karimnagar: నకిలీ ఓట్లకు చెక్.. కరీంనగర్‌లో పకడ్బందీగా ‘ఎస్ఐఆర్’ సర్వే: మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కీలక ప్రకటన!
కరీంనగర్: పారదర్శకమైన ఓటరు జాబితా రూప కల్పనే ద్యేయంగా నగరపాలక సంస్థ పరిదిలో చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, నగర ప్రజలు సహాకరించాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. సమగ్ర ఓటర్ సవరణ, పారదర్శకమైన ఓటర్ జాబితా, మరణించిన, నఖిలీ ఓటర్లను జాబితా నుండి తొలగిమచడం తదితర అంశాలపై పొలిటికల్ పార్టీల ప్రతి నిధులతో చర్చించారు. పలు సూచనలు చేస్తూ నగర ప్రజలకు సంబంధిత విషయం పై అవగాహన కల్పించి సమగ్ర ఓటర్ సవరణ చేస్కునేలా చర్యలు తీస్కోవాలని పార్టీల ప్రతి నిధులకు సూచించారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిదిలోని సమగ్ర ఓటర్ జాబితా సవరణ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించేలా డివిజన్ల వారిగా ప్రజలను అవగాహన పరిచి... ఓటర్ సవరణ చేస్కునేలా చూడాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకొని బిఎల్ఓ ల ద్వారా అవసరమైన సవరణలు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఓటర్ల సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.




