Karimnagar: కరీంనగర్ 'వన మహోత్సవం' - 4 లక్షల మొక్కల లక్ష్యం
Karimnagar: కరీంనగర్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపు. కొత్తపల్లిలో వానర వనాలు, నగరవ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు.
Karimnagar: కరీంనగర్ 'వన మహోత్సవం' - 4 లక్షల మొక్కల లక్ష్యం
కరీంనగర్: నగరపాలక సంస్థ పరిదిలో గల కొత్తపల్లి లో " వానర వనాలను ఏర్పాటు చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం జరిగింది. నగర వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టే " వన మహోత్సవం " పై ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తో మేయర్, కమీషనర్ సుదీర్ఘంగా చర్చించారు. మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు, చేయాల్సిన ఏర్పాట్ల పై దిశానిర్దేశం చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరాన్ని " గ్రీన్ సిటీగా మార్చడంలో ప్రతి ఒక్కురు భాగస్వాములై... అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేసి 4 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్పోరేటర్ల సహాకారంతో నగర ప్రజలను భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున వనాలను నాటేందుకు చర్యలు తీస్కోవాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించడమే ధ్యేయంగా "వనమహోత్సవం" కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.
నగర వ్యాప్తంగా వన మహోత్సవంలో స్థలాలకు అనుకూలమైన పూలు, పండ్లు, ఔషద మొక్కలను పెద్ద ఎత్తున నాటి సంరక్షించేందుకు కావల్సిన ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. నగరంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, విద్యాసంస్థలు మరియు కాలనీల్లో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను తక్షణమే గుర్తించాలన్నారు. నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు చర్యలు తీస్కోవాలన్నారు. ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ...
నగర వ్యాప్తంగా ఎక్కడెక్క స్థలాలు ఉన్నాయో గుర్తించి... బౌండరీలు ఏర్పాటు చేయాలన్నారు. వన మహోత్సవంలో ప్రధానంగా బ్లాక్ ప్లాంటేషన్, పట్టణ వనాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని... వాటికి అనువైన స్థలలాను గుర్తించి... మొక్కలను కూడ సిద్దం చేయాలన్నారు. నాటిన మొక్కను రక్షించేందుకు అధికారులు, వన మహోత్స సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పద్దతుల్లో నాటిన మొక్కలు వంద శాతం బతికేలా నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నీటి తడులు అందించాలని ఆదేశించారు.
"నగరాన్ని హరిత కరీంనగర్‌గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వనమహోత్సవం'ను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమీషనర్లు ఆయాజ్, సువార్త, అసిస్టెంట్ కమీషనర్ రాజ మనోహర్, ఈఈ లచ్చి రెడ్డి, డీసిపి బషీరొద్దిన్, ఎంహెఓ సుమన్, డీఈలు, ఏఈలు, వన మహోత్స సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




