Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు!
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు దీపాలు వెలిగించి పూజలు చేశారు.
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు!
కరీంనగర్: దీపాలు వెలిగించి, ధనలక్ష్మీ పూజలు నిర్వహించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మేయర్, డిప్యూటీ మేయర్. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ఉద్యోగ సిబ్బంది తో కలిసి దీపావళి సంబరాలు నిర్వహించారు.
కార్యాలయ ఆవరణను ప్రమిదలతో సుందరంగా అలంకరించి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు దీపాలను వెలిగించారు. అనంతరం క్యాష్ రూంలో శ్రీ ధనలక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... "కరీంనగర్ నగర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను ఆనందోత్సవాల మద్య జరుపుకోవాలని పిలుపు నిచ్చారు.
బాణాసంచాలు పేల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని... ముఖ్యంగా చిన్న పిల్లలు బాణాసంచాలకు దూరంగా ఉండేలా చూడాలన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు నగర ప్రజలందరి కలిగియుండి...ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో పాటు ఆర్థిక పురోగతిని సాధించాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మంచి ఆర్థికాభివృద్ధి సాధించి...నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం లోనే అగ్రస్థానంలో నిలవాలన్నారు.
ఈ వేడుకల్లో కార్పోరేటర్లు మాసం గణేష్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిల్ల రాజకుమారి ప్రసాద్, అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీ కమీషనర్లు వేణు మాధవ్ ఖాధర్ మోహియోద్దిన్, అసిస్టెంట్ కమీషనర్ రాజమనోహర్, ఉద్యోగులు వెంకటేష్, సునీల్, నర్సయ్య, విజయలక్ష్మీ తేజశ్వినీ, తదితరులు పాల్గొన్నారు.




