Karimnagar: కరీంనగర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల ఉక్కుపాదం!

Karimnagar: కరీంనగర్ నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 25 Jun 2026 9:33 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల ఉక్కుపాదం!

కరీంనగర్: కరీంనగర్ నగరంలో పాదచారులకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్లు, ఫుట్ పాత్‌ల ఆక్రమణలపై నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ పోలీసుల సహకారం తో నగరంలో ఆక్రమణల తొలగింపు పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

నగరంలోని పలు ప్రధాన కూడళ్లతో పాటు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ​కలెక్టర్ క్యాంపు కార్యాలయం రోడ్డు, ​శనివారం మార్కెట్ రోడ్డు, ​రాజీవ్ చౌక్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న దుకాణాలను, రోడ్లపైకి చొచ్చుకువచ్చిన తాత్కాలిక షెడ్లను, తోపుడు బండ్లను తొలగించారు.

రోడ్లు, ఫుట్ పాతులను ఆక్రమించి వ్యాపారం చేస్తే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీస్కుంటామని ఈ సంధర్బంగా టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. నగర వ్యాప్తంగా ఫుట్ పాత్, రోడ్ల ఆక్రమణల పై ప్రత్యేక డ్రైవ్ ను నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వేణు, శ్రీధర్, తేజశ్వనీ, సాయి చరన్, నవీన్,ఖాధర్, ట్రాఫిక్ ఎస్సై హనుమంతరావు, డిఆర్ఎఫ్ లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story