Karimnagar: బీజేపీ వ్యూహం ఫలించింది.. కో-ఆప్షన్ స్థానాలు కైవసం!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం! ఐదు స్థానాలను కైవసం చేసుకున్న కమలదళం.
Karimnagar: బీజేపీ వ్యూహం ఫలించింది.. కో-ఆప్షన్ స్థానాలు కైవసం!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదు స్థానాలు భాజపాకైవాసం చేసుకుంది. నగరపాలక కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మేయర్ అధ్యక్షత జరిగిన ఎన్నికల్లో కో ఆప్షన్ సభ్యులుగా మైనారిటీ విభాగంలో హసీనా బేగంబేగం, బల్వీర్ సింగ్ విజేతలుగా నిలిచారు. కన్న కృష్ణ, నందకుమార్, చిగిరి వెంకటమ్మ గెలుపొందారు. ఎన్నికలు జరుగుతున్న వేళ 66 మంది కార్పొరేటర్లకు గాను 42 మంది హాజరయ్యారు కోరం ఉండడంతో ఎన్నికలు కొనసాగించారు.
సాధారణ విభాగంలో మూడు కోఆప్షన్ పదవులకు 27 మంది మైనారిటీ విభాగంలో రెండు స్థానాలకు 13 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ఐదుగురు మాత్రమే మెజారిటీ సాధించి కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయి ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి తరఫున ఎన్నికైన కోఆప్షన్ సభ్యులకు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తతెలిపారు.
ఫలించిన భాజపా వ్యూహం..
ఎన్నికల్లో భాజపా వ్యూహం ఫలించింది. భాజపా చెందిన 34 మంది కార్పొరేటర్లతోపాటు పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బారాసా నుంచి నలుగురు చేతులెత్తి ఓటు వేశారు. ఆయా అభ్యర్థులను బట్టి ఒకసారి ఒకరికి ఇంకోసారి ఇంకొకరికి భరోసా కార్పొరేటర్లు భాజపా అభ్యర్థులను బలపరచడం చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి పోటీ చేస్తామని హంగామా చేసిన బారాస తరపున ఎవరిని నిలపలేదు ఉన్న పదిమందిలో నలుగురు భాజపా పక్షాన నిలబడడం గమనార్హం. పాలకవర్గంలో సఖ్యత ఉండి పనులు చేయించుకోవాలనే భావనతో బారస సభ్యులు మద్దతు తెలిపారని వాదన వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు సభ్యులు ఎన్నికల్లో పాల్గొనలేదు. ఏది ఏమైనా భాజపా చక్రం తిప్పిందని అందరూ అనుకుంటున్నారు.




