Karimnagar: మాజీ కార్పొరేటర్ తీరుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన!
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ ఉద్యోగులపై మాజీ కార్పొరేటర్ రమేష్ చేసిన అసాంఘిక చర్యను నిరసిస్తూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
Karimnagar: మాజీ కార్పొరేటర్ తీరుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన!
Karimnagar: నిన్న అనగా 27-04-2026 తేదీన మధ్యాహ్న సమయంలో చోటుచేసుకున్న సంఘటనలో మున్సిపల్ ఉద్యోగులపై జరిగిన అసాంఘిక చర్యను నిరసిస్తూ, ఈ రోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దారం శ్రీనివాస్ రెడ్డి మరియు మడిపెల్లి కాళీ చరణ్ మాట్లాడుతూ, మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ళ రమేష్ విధుల్లో ఉన్న మున్సిపల్ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, తన అసభ్య పదజాలంతో అవమానకరంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు.
మున్సిపల్ ఉద్యోగులు ఎల్లప్పుడూ ప్రభుత్వ ఆదేశాలు, చట్టాలు మరియు నియమావళి మేరకు తమ విధులను నిర్వర్తిస్తారని, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలను చేపట్టరని వారు స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి తమ అభీష్టం మేరకు వ్యవహరించాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తేవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుచితమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో, ఉద్యోగుల జేఏసీ తరఫున మాజీ కార్పొరేటర్ గుగ్గిళ్ళ రమేష్ మున్సిపల్ ఉద్యోగులకు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ సువార్త కి జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించడం జరిగింది. అనంతరం మేయర్ తో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తు వారితో మాట్లాడి మొత్తం విషయాన్ని కూలంకషంగా వివరించగా, మేయర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కాబట్టి, కమిషనర్ ఈ వ్యవహారాన్ని అత్యంత కీలకమైన విషయంగా పరిగణించి, గుగ్గిళ్ళ రమేష్ ని పిలిపించి మున్సిపల్ ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పించవలసిందిగా, అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ ఉద్యోగులకు తగిన రక్షణ, భరోసా కల్పించవలసిందిగా ఉద్యోగుల జేఏసీ వినమ్రంగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు మరియు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి గెస్ట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మరియు ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి కేంద్ర సంఘం నాయకులు సర్దార్ హర్మేందర్ సింగ్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంతరావు రూరల్ అధ్యక్షుడు కోడూరి వాస్తవి గౌడ్ కార్యదర్శి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ మున్సిపల్ ఉద్యోగులు సునీల్ శ్యామ్ నరసయ్య నాయకులు అభినయ్ రెడ్డి రామ్మోహన్ లవ కుమార్ కరుణాకర్ రాజేష్ ఉద్యోగులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




