Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కార్మికుల రెండు రోజుల దీక్షలు!

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు రెండు రోజుల దీక్షలు ప్రారంభించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 18 Jun 2026 6:28 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కార్మికుల రెండు రోజుల దీక్షలు!

కరీంనగర్: సిఐటియు అనుబంధ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జూన్ 18, 19 రెండు రోజుల దీక్ష ఈరోజు ఉదయం 11 గంటలకు సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు ప్రారంభించారు. సుమారు 250 మంది దీక్షలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలని అమలు చేయాలని, మున్సిపల్, మున్సిపల్ కార్పోరేషన్లో పని చేసే ఔట్సోర్సింగ్ ఎన్.ఎం.ఆర్ ఫిక్స్డ్ పే కార్మికులను పర్మనెంట్ చేయాలని, రెండో పిఆర్సి ప్రకటించి కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి, కేటగిరి వేతనాలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఒక్కపూట 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ప్రతి సం. మున్సిపల్ పనిచేసే శానిటేషన్, వాటర్ వర్క్స్, హరితహారం, ఎలక్ట్రిషన్, డ్రైవర్లకు రక్షణ పరికరాలు, చెప్పులు, గౌజ్లు, బెల్లం, కొబ్బరినూనె, రేయిన్ కోట్, రెండు ఆఫ్రాన్లు అందచేయాలన్నారు. కార్పోరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లకు, జవాన్లకు మిగతా వారి వలే డ్రైవర్ కేటగిరి వేతనం ఇవ్వాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళ డ్యూటీ చేసే కార్మికులకు రవాణా, రెస్టు రూములు ఏర్పాటు చేయాలన్నారు.

మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఆదాయాలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నాయని అన్నారు. కార్యకలాపాలన్నీ ప్రజల నివాస ప్రాంతాలైన పట్టణాలు, గ్రామాల్లో జరుగుతాయని, పన్నుల్లో వాట మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని విమర్శించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, వినోద పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు మినహా జీఎస్టీ లో గాని, పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలలో గాని మున్సిపాలిటీలకు పన్నులలో వాటా లేదన్నారు. చివరకు ఎల్.ఆర్.ఎస్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి రాజేశం, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపల్లి పోచయ్య, కార్పొరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మానుపాటి మల్లేశం, దేవునూరి శ్యాంసుందర్, నాయకులు దాసరి రాజమల్లయ్య, బందిలి తిరుపతి, బడిగల చంద్రయ్య, బి వెంకటస్వామి, కొంకంటి పద్మ, పురత్తం రాధ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story