Karimnagar: రేపు కరీంనగర్‌కు నితిన్ నబీన్.. చరిత్ర సృష్టించేలా పాదయాత్ర

Karimnagar: సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ మహా పాదయాత్ర; సర్‌కు మద్దతుగా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Nov 2026 4:56 PM IST
Karimnagar
X

Karimnagar: రేపు కరీంనగర్‌కు నితిన్ నబీన్.. చరిత్ర సృష్టించేలా పాదయాత్ర

కరీంనగర్: రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారు. సర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలపట్ల విబేధాలు స్రుష్టిస్తోంది. దీనిని తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు బీజేపీ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్ల మహా పాదయాత్ర పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ లో మహా పాదయాత్ర చేయాలని నిర్ణయింది.

ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన మహాపాదయాత్రకు అమిత్ షా హాజరయ్యారు. రేపు కరీంనగర్ లో జరగబోయే మహాపాదయాత్ర చరిత్ర స్రుష్టించబోతోంది. భారీ ఎత్తున కనీవినీ ఎరగని రీతిలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అన్ని సంఘాలు వచ్చి సర్ కు మద్దతుగా మహాపాదయాత్రకు హాజరై నితిన్ నబిన్ తో నడవాలని బిజెపి కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కోరారు.

18 ఏళ్లు నిండిన వాళ్లకు ఓటు హక్కు కల్పించడమే సర్ ఉద్దేశం.రెండు ఓట్లుంటే ఒక ఓటును తొలగించడమే సర్ లక్ష్యం,మరణించిన వారి ఓట్లను ఓటర్ జాబితా నుండి తొలగించడమే సర్ లక్ష్యం. విదేశాల నుండి అక్రమంగా చొరబడి ఓటు హక్కు పొందిన వాళ్లను ఓటర్ జాబితా నుండి తొలగించడమే సర్ లక్ష్యం.దొంగ ఓట్లను ఏరిపారేసి అర్హులైన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించడమే సర్ ఉద్దేశం.

ఇంత మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్ కు మద్దతుగా నితిన్ నబిన్ చేపడుతున్న మహాపాదయాత్రకు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలపాలని కోరుతున్నా. ఈ యాత్రలో నితిన్ నబిన్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ఇంఛార్జీ సునీల్ బన్సల్, సహా ఇంఛార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మ తదితరులు హాజరవుతారు. కరీంనగర్ గాంధీ బొమ్మ నుండి వైశ్యా భవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు సాగుతుంది.

సర్ ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులే. వేరే దేశస్తులకు ఓట్లు కావాలని కోరుకునే వాళ్లంతా మూర్ఖులే. ఈ దేశ పౌరులు మాత్రమే ఈ దేశ ప్రధాని, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది నిర్ణయించారు. సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎన్నుకునే అధికారం భారతీయులకు మాత్రమే ఉంది.

బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నడు. బీజేపీని తట్టుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలకు బీజేపీ అంటే భయం. బీజేపీని అడ్డుకోవాలని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీని తట్టుకునే శక్తి కూడా లేదు. తెలంగాణలో నిధులు రావాలంటే, అభివ్రుద్ది చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం అన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR