Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు.. బోనం ఎత్తిన మేయర్!
Karimnagar: కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్, రామచంద్రపురి కాలనీలలో పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు.. బోనం ఎత్తిన మేయర్!
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్, రామచంద్రపురి కాలనీలలో ఘనంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని, సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నగర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు గ, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, నాంపల్లి రేణుక, శ్రీనివాస్, పొన్నం లక్ష్మి మొండయ్య, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




