Karimnagar: కరీంనగర్‌లో వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

Karimnagar: కరీంనగర్ నగరంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు. హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 26 July 2026 4:09 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

కరీంనగర్: కరీంనగర్ ​నగరంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని చింతకుంట, కిసాన్ నగర్, శివాజీ నగర్, పసుల నారాయణ కాలనీ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.

​ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

​ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన నాయకులు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story