Karimnagar: కరీంనగర్ పోలీసులకు 4 రోజుల సైబర్ క్రైమ్ ప్రత్యేక శిక్షణ

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులకు నిర్వహించిన 4 రోజుల సైబర్ క్రైమ్ కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 July 2026 9:01 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ పోలీసులకు 4 రోజుల సైబర్ క్రైమ్ ప్రత్యేక శిక్షణ

కరీంనగర్: తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్, ఆదేశాల మేరకు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఆధ్వర్యంలో, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, స్టేషన్ రైటర్లు, సైబర్ వారియర్లు మరియు ఇతర పోలీసు సిబ్బందికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ ఆధ్వర్యంలో 4 రోజుల సైబర్ క్రైమ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రొగ్రమ్మె విజయవంతంగా నిర్వహించబడిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ తెలిపారు.

ఈ శిక్షణలో ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల ధోరణులు, సైబర్ నేరాల దర్యాప్తు విధానాలు, సైబర్ చట్టాలు, సాంకేతిక అంశాలు, బాధితులకు సత్వర సేవలు అందించే విధానాలు మరియు సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాలపై పోలీసు అధికారులకు సమగ్ర శిక్షణ అందించారు. శిక్షణ ప్రారంభానికి ముందు Pre-Test, శిక్షణ అనంతరం Post-Test నిర్వహించి పాల్గొన్న అధికారుల అవగాహనను అంచనా వేయడంతో పాటు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా సేకరించారు.

శిక్షణలో పాల్గొన్న అధికారులు సైబర్ నేరాల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై విలువైన అవగాహన పొందామని, ఇటువంటి శిక్షణలు విధి నిర్వహణలో ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, IPS మాట్లాడుతూ, ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, గిఫ్ట్ స్కామ్‌లు, APK ఫైల్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు మరియు ఇతర సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడంతో పాటు www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన మోసాలు జరిగిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు పోలీసు అధికారుల దర్యాప్తు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ అధికారులు తెలిపారు.

ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, పోలీసు అధికారులకు నాణ్యమైన శిక్షణ అందించిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, IPS ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బంది చూపిన కృషి, సమన్వయం, అంకితభావాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story