Thimmapur: ఐకేపీ కేంద్రాల్లో రైతుల అష్టకష్టాలు!
Thimmapur: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల జిల్లా శిక్షణ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ముఖ్య వక్త.
Thimmapur: ఐకేపీ కేంద్రాల్లో రైతుల అష్టకష్టాలు!
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండి కాలనీ లోగల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జిల్లా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో రైతులు తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి, తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.
కేంద్రం మద్దతు ధర నిర్ణయించి, కొనుగోలు వ్యయాన్ని భరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచిపెట్టి కేంద్రంపై నెపం నెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. ధాన్య సేకరణపై మంత్రుల ప్రకటనల్లో పొంతన లేకపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన వరి, మామిడి రైతులను ఆదుకోవాలని, కలెక్టర్లు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.




