Karimnagar: రాజీవ్ రహదారిపై నిలిచిపోయిన రాజధాని ఏసీ బస్సు!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ఆర్టీసీ 1 డిపోకు చెందిన రాజధాని ఏసీ బస్సు నిలిచిపోయింది. ఎమర్జెన్సీ అలారం మోగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 12 Nov 2026 3:19 PM IST
Karimnagar
X

Karimnagar: రాజీవ్ రహదారిపై నిలిచిపోయిన రాజధాని ఏసీ బస్సు!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై నిలిచిపోయిన కరీంనగర్ ఆర్టీసీ 1 డిపోకు చెందిన రాజధాని ac బస్సు. కరీంనగర్ నుండి హైదరాబాదు వెళ్తుండగా నిలిచిన బస్సు. బస్సులో ఎమర్జెన్సీ అలారం రావడంతో డ్రైవర్ ను అప్రమత్తం చేసిన ప్రయాణికులు, ఎమర్జెన్సీ అలారం ఎంతసేపటికి ఆఫ్ కాకపోవడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ వరుస బస్సు ప్రమాదాలు సంఘటనల నేపథ్యంలో డీజిల్ బస్సు లో కూడా ఎమర్జెన్సీ అలారం మోగడంతో భయపడిన ప్రయాణికులు.

చాలామంది ఎయిర్పోర్టుకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్ మిస్ అయితే మా పరిస్థితి ఏంటని ఆర్టీసీ అధికారులను నిలదీస్తే సమాధానం లేదు. ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించడం లేదని ఆరోపణ, బస్సు లేటుగా రావడంతో ప్రయాణికులు మరో బస్సు ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU