Karimnagar: కరీంనగర్‌లో అబ్బురపరిచిన రోబోటిక్ మూషిక ప్రదర్శన!
Karimnagar: కరీంనగర్ రాంనగర్‌లో దేశంలోనే తొలి రోబోటిక్ మూషిక ప్రదర్శన. గణేశ్ మండపం వద్ద సాంకేతిక అద్భుతాన్ని, కాశీ హారతిని తిలకించిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం.
Karimnagar: కరీంనగర్‌లో అబ్బురపరిచిన రోబోటిక్ మూషిక ప్రదర్శన!
కరీంనగర్: కరీంనగర్‌లోని రాంనగర్ ఛాలెంజ్ యూత్ గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి రోబోటిక్ మూషిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. డొబో రోబోటిక్స్ ఆధ్వర్యంలో వినాయకుడి వాహన రూపంలో తీర్చిదిద్దిన ఈ అద్భుత సాంకేతికతను చూసేందుకు పిల్లలు, పెద్దలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయం ఉట్టిపడేలా టెక్నాలజీతో రూపొందించిన ఈ రోబో మూషికాన్ని కళ్లతో తిలకించి భక్తులు, చిన్నారులు ఎంతో ఆనందించారు.
మొదటిసారి ఈ మూషిక ప్రదర్శన నిర్వహించడంతో భారీగా తరలివచ్చిన ప్రజలు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అధ్యాత్మికతతో పాటు టెక్నాలజీ కూడా తోడైతే అది ఎంతో ఆనందంగా కన్నుల పండగ ఉంటదని రోబో నిర్వాహకులు తిరుపతిరెడ్డి అన్నారు. ఈ రోబోటిక్ మూషిక పదర్శన, మహాగణపతి ప్రతిరోజు నిర్వహించే కాశీ హారతిని కరీంనగర్ సి పి గౌస్ అలాం తిలకించారు.




