Jammikunta: వానల కోసం 'కప్పతల్లి' ఆట కరీంనగర్ జిల్లాలో వినూత్న పూజలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా రంగమ్మపల్లెలో వర్షాల కోసం గ్రామస్థులు సాంప్రదాయ 'కప్పతల్లి' ఆట ఆడారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని దేవుడిని ప్రార్థించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 17 July 2026 10:02 AM IST
Jammikunta
X

Jammikunta: వానల కోసం 'కప్పతల్లి' ఆట కరీంనగర్ జిల్లాలో వినూత్న పూజలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని రంగమ్మపల్లె గ్రామంలో ఉదయం గ్రామ ప్రజలంతా కలిసి వర్షాలు పడాలని ఎన్నో దేవత మూర్తులను జలాభిషేకాలు చేసి కప్పతల్లి ఆట ఆడితే వర్షాలు వస్తాయని నమ్మకంతో గ్రామస్తులంతా కలిసి పడుతున్న చిన్నపాటి వర్షంలో కప్పతల్లి ఆట ఆడుతూ ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు.

ఇప్పటికైనా మా ఆటతో మాకు దేవుడు కనికరించి కప్పాల ఆటలతో వర్షాలు కురవాలని మా రైతులను చల్లగా చూడాలని మా యొక్క పాడిపంటలు మంచిగా పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కప్ప తల్లి ఆట ఆడుతున్నాం అని గ్రామస్తులు అంటున్నారు.

ఇప్పటికే పెట్టిన పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయని వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఇప్పటికే నారు మల్లేసి నాట్లు వేసినాము వర్షాలు కురవాలని బాయిలాల నీళ్లు లేవు చెర్ల నీళ్లు లేవు అందుకే కప్పతల్లి ఆట ఆడితే వర్షాలు వస్తాయని నమ్మకంతో ఆట ఆడుతున్నామని గ్రామస్తులు సంతోషంగా చెబు తున్నారు దేవుడు ఇప్పటికైనా కనికరిస్తాడని ఆశిస్తాం.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story