Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు!
Karimnagar: తెలంగాణలోని కరీంనగర్-2 ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగడం కలకలం రేపింది.
Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు!
కరీంనగర్: కరీంనగర్-2 ఆర్టీసీ డిపోలో బుధవారం ఉదయం వేళ నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు కలకలం రేగింది. డిపోలో నిలిపి ఉంచిన ఒక ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీ లోపం కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్పందించిన అగ్నిమాపక పరికరాలతో శ్రమించి మంటలను అదుపు చేశారు.
నిలిపి ఉంచిన ప్రమాదం చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఎలక్ట్రిక్ బస్సుల్లో సాంకేతిక లోపం బ్యాటరీల లోపం కారణంగా మంటలు చెలరేగడం బస్సు పూర్తిగా తగలబడిన ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
బస్సుల్లో జరుగుతున్న ఘటనలు సాంకేతిక లోపమా, బ్యాటరీల మెయింటెనెన్స్ లేఖన, లేదా మరేదైనా కోణం ఉందా అనే దానిపై ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. రెండు బస్సుల ప్రమాద ఘటనలో ఆంటీ ప్రాణనష్టం సంభవించకపోవడం మొదటి బస్సు ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం రెండవ బస్సు ఘటన నిలిపి ఉన్న సమయంలో జరగడం వల్ల ఊపిరి పీల్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఘటనైనా దీనిపై పూర్తి విచారణ చేసి మరొక సారీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.




