Karimnagar: సమయస్ఫూర్తి చాటిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలు సేఫ్!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 21 Jun 2026 2:40 PM IST
Karimnagar
X

Karimnagar: సమయస్ఫూర్తి చాటిన ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణికుల ప్రాణాలు సేఫ్!

Karimnagar: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులో కాకతీయ కెనాల్ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కరీంనగర్ 2వ డిపో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ప్రమాద వశాత్తూ మంటల్లో కాలిపోయింది.

అందులోని ప్రయాణికులు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆర్టీసీ బస్సు అలుగునూర్ వద్దకు రాగానే కాలిన వాసన రావడంతో డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై బస్సును రోడ్డు కిందకు దింపి అందులో ప్రయాణిస్తున్న 41 మందిని కిందకు దింపారు.

మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story