Karimnagar: మోటార్లు, కాపర్ వైర్ దొంగల అరెస్ట్: కరీంనగర్ పోలీసులు!

Karimnagar: కరీంనగర్‌లో వ్యవసాయ కరెంట్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 30 Oct 2026 7:43 AM IST
Karimnagar
X

Karimnagar: మోటార్లు, కాపర్ వైర్ దొంగల అరెస్ట్: కరీంనగర్ పోలీసులు!

కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీసులు కరెంట్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు కరెంట్ మోటార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ఇద్దరు 1. వివర్ సాయికుమార్ (28 సంవత్సరాలు)

నివాసం: వాల్మీకి నగర్, కరీంనగర్. ప్రస్తుతం ఇంద్రమ్మ కాలనీ, బద్దిపల్లి గ్రామం, కొత్తపల్లి మండలం. వజీద్ పాషా (24 సంవత్సరాలు)

నివాసం: సుభాష్ నగర్, కరీంనగర్. ప్రస్తుతం ఇంద్రమ్మ కాలనీ, బద్దిపల్లి గ్రామం, కొత్తపల్లి మండలం. వీరిద్దరూ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

నిందితులు చేసిన నేరాల వివరాలు..

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు ఇద్దరూ కలిసి రాత్రి సమయాల్లో ఆటోలో తిరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను, వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంట్ మోటార్లను దొంగిలించేవారు. అనంతరం వాటిని గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించి, వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేసేవారు.

ఇటీవల కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా కరెంట్ మోటార్ల దొంగతనాలు జరుగుతుండటంతో, పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు.

వీరిపై కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూరు మండలాలు తదితర పోలీస్ స్టేషన్లలో మొత్తం 8 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN