Thimmapur: సర్పంచ్‌పై సొసైటీ చైర్మన్ దాడి.. తిమ్మాపూర్‌లో కలకలం!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తిరుపతిపై నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ రమణారెడ్డి కర్రతో దాడి చేశారు. ఎల్‌ఎండీ పీఎస్‌లో కేసు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 10 Sept 2026 3:34 PM IST
Thimmapur
X

Thimmapur: సర్పంచ్‌పై సొసైటీ చైర్మన్ దాడి.. తిమ్మాపూర్‌లో కలకలం!

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతి పై నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి దాడి. ఎల్ ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సర్పంచ్ తిరుపతి. బాధితుడు తిరుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతి గురువారం ఉదయం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు గ్రామపంచాయతీ వద్దకు బైక్ పై చేరుకోగా అక్కడే ఉన్న సొసైటీ చైర్మన్ రమణారెడ్డి కర్రతో దాడికి పాల్పడినాడు.

తలపై కొట్టేందుకు ప్రయత్నించగా సర్పంచ్ తిరుపతి చేయి అడ్డుపెట్టడంతో చేయికి బలమైన గాయం తగిలింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి వెళ్ళాడు.

తనపై అత్యాయత్నానికి పాల్పడినట్లు సర్పంచ్ తిరుపతి ఆరోపించాడు. తన భర్తకు ప్రాణ హానీ ఉందని సర్పంచ్ తిరుపతి భార్య స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సర్పంచ్ పై దాడిని తాము ఖండిస్తున్నట్లు పలువురు సర్పంచులు తెలిపారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU