Karimnagar: ఆడబిడ్డ పెళ్లికి 'పెద్దన్న' సాయం.. గంగాధర సర్పంచ్ ఉదారత!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న తన ఎన్నికల హామీని నెరవేర్చుకున్నారు.
Karimnagar: ఆడబిడ్డ పెళ్లికి 'పెద్దన్న' సాయం.. గంగాధర సర్పంచ్ ఉదారత!
కరీంనగర్ జిల్లా: గంగాధర గ్రామంలో గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పేద కుటుంబానికి అండగా నిలిచారు.
గ్రామంలోని పేద ఆడబిడ్డల వివాహాలకు తన వంతుగా ₹10,116 ఆర్థిక సహాయం అందజేస్తానని గతంలో ప్రకటించిన సర్పంచ్ , ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు గంగాధర గ్రామానికి చెందిన ప్యాట రామచందర్-అంజలి దంపతుల కుమార్తె ప్యాట ప్రవళిక వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువును ఆశీర్వదించిన అనంతరం, వధువు కుటుంబానికి ₹10,116 నగదును పెళ్లి కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడటమే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఆడబిడ్డల వివాహాలు కుటుంబాలకు భారంగా మారకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
సర్పంచ్ చేస్తున్న సేవా కార్యక్రమంపై వధువు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా ఆయన సేవా భావాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




