Karimnagar: రీంనగర్‌లో అంకురార్పణతో మొదలైన వరాహ బ్రహ్మోత్సవాలు!

Karimnagar: కరీంనగర్ సర్వవైదిక సంస్థానంలోని శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Oct 2026 11:36 PM IST
Karimnagar
X

Karimnagar: రీంనగర్‌లో అంకురార్పణతో మొదలైన వరాహ బ్రహ్మోత్సవాలు!

కరీంనగర్: సర్వవైదిక సంస్థానం నిర్వహణలోని యజ్ఞ వరాహ క్షేత్రం లో కొలువై ఉన్న శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి 40 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం జరిగే సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలతో ఆరంభమవుతాయి. సేనాధిపతి ఉత్సవం అనేది బ్రహ్మోత్సవాల వంటి పెద్ద ఉత్సవాలకు ముందు రోజు అంకురార్పణలో భాగంగా నిర్వహించే ఒక ముఖ్యమైన ఘట్టం.

ఈ ఉత్సవంలో శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో నైరుతి దిశలో నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసుకు వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు.

యాగశాలలో తొమ్మిది పాలికలలోఈ మట్టిని నింపి, శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. దీనినే అంకురార్పణ అని అంటారు.ఈ విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయని విశ్వాసం. అనంతరం ధ్వజపట శయనాధివాసం వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుమారి స్వప్న కుమారి శిష్య బృందం నృత్య ప్రదర్శనాంశాలు అందరినీ అలరించాయి.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN