Karimnagar: యువ ఆపద మిత్ర శిక్షణ పూర్తి చేసిన ఎస్‌యూ విద్యార్థులు!

Karimnagar: శాతవాహన వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3 విద్యార్థులు మంచిర్యాల గుడిపేటలో జరిగిన 7 రోజుల 'యువ ఆపద మిత్ర' శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. వీసీ ఉమేష్ కుమార్ అభినందనలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Nov 2026 8:31 PM IST
Karimnagar
X

Karimnagar: యువ ఆపద మిత్ర శిక్షణ పూర్తి చేసిన ఎస్‌యూ విద్యార్థులు!

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్–IIIకు చెందిన తొమ్మిది మంది విద్యార్థి వాలంటీర్లు 2026 అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు రెండవ విడతలో భాగంగా నిర్వహించిన ఏడు రోజుల యువ ఆపద మిత్ర శిక్షణా కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా గుడిపేట బెటాలియన్ శిబిరంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో విపత్తుల సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థులు పొందారు. ఈ శిక్షణలో భాగంగా ప్రథమ చికిత్స, ప్రాథమిక జీవనాధార సహాయం, (బిఎల్ఎస్ ), గుండె మరియు శ్వాసక్రియ పునరుద్ధరణ ప్రక్రియ (సిపిఆర్), రక్తస్రావ నియంత్రణ, గాయాల సంరక్షణ, పాము మరియు ఇతర జంతువుల కాట్లకు ప్రాథమిక చికిత్స, అగ్నిప్రమాదాల నివారణ మరియు భద్రత, శోధన, రక్షణ చర్యలు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడం, ఈత, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి అంశాలపై వాలంటీర్లకు సైద్ధాంతిక ప్రాయోగిక శిక్షణ అందించారు.

ఈ శిక్షణలో ఎం.కామ్ విద్యార్థులైన కె. నాగరాజు, పి. అభిషేక్, కె. మనీషా, డి. నాగలక్ష్మి, అలాగే ఎం.బి.ఏ విద్యార్థులైన బి. సుమిత్ర, జి. మనోగ్న, బి. లక్ష్మీప్రసన్న, ఎం. రవిచంద్ర, కె. సూర్యప్రకాశ్ పాల్గొని విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు. ఈ సందర్భంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ "విపత్తుల సమయంలో సమాజానికి సేవలందించేందుకు విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, క్రమశిక్షణతో పాటు అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందుతుందన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN