Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి విద్యార్థిని ఆత్మహత్య!
Karimnagar: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి ద్వితీయ సంవత్సరం చదువుతున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థిని చంద్రకళ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి విద్యార్థిని ఆత్మహత్య!
కరీంనగర్: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేస్తుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న చంద్రకళ అనే విద్యార్థిని ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రకళ అని అమ్మాయి శాతవాహన యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి రెండవ సంవత్సరం హాస్టల్లో ఉంటూ చదువుకుంటుందన్నారు. యూనివర్సిటీ సిబ్బంది సమాచారం అందించడంతో హాస్టల్ వద్దకు చేరుకొని అమ్మాయి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ఆత్మహత్యకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిందని సంఘటనపై విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.




