Karimnagar: కరీంనగర్‌లో శాతవాహన వర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు

Karimnagar: కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయ అంతర్ విశ్వవిద్యాలయ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించి, రాజస్థాన్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 28 Nov 2026 11:52 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో శాతవాహన వర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు

కరీంనగర్: తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో శాతవాహన అంతర్‌ విశ్వవిద్యాలయ టీం సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికల పోటీలను నిర్వహించారు. ఈ ఎంపికలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాజస్థాన్‌లో జరగనున్న అంతర్‌ విశ్వవిద్యాలయ సాఫ్ట్‌బాల్ పోటీలలో శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సురేష్ కుమార్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ , అత్యుత్తమ ప్రతిభతో రాణించి రాజస్థాన్‌లో జరిగే అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీలలో విశ్వవిద్యాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ప్రోత్సహించారు.

ఈ ఎంపికలలో స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ నజిముద్దీన్ మున్వర్, టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భవాని, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే అనూష, సెలెక్షన్ బోర్డు సభ్యులు సంపత్, పీడీ విజయ్ కుమార్, పీడీ దినేష్ పాల్గొని ప్రతిభావంతులైన క్రీడాకారులను విశ్వవిద్యాలయ జట్లకు ఎంపిక చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR