Karimnagar: కరీంనగర్ సైన్స్ మ్యూజియంను సందర్శించిన కమిషనర్ ప్రఫుల్

Karimnagar: కరీంనగర్ జిల్లా సైన్స్ మ్యూజియంలో నూతనంగా చేపట్టిన ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో కలిసి పరిశీలించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 2 July 2026 9:30 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ సైన్స్ మ్యూజియంను సందర్శించిన కమిషనర్ ప్రఫుల్

​కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైన్స్ మ్యూజియం ఎంతో చారిత్రాత్మకమైందని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరంలోని చారిత్రాత్మక జిల్లా సైన్స్ మ్యూజియం ను కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో కలిసి సందర్శించారు. ఇటీవలే ఈ మ్యూజియంలో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో పనుల నాణ్యత, పురోగతిని పర్యవేక్షించి, నిశితంగా పరిశీలించారు.

మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్ నమూనాలు, గ్యాలరీలు, ఏర్పాటు చేసిన మౌలిక వసతులను నిశితంగా పరిశీలించారు. చరిత్ర కలిగిన మ్యూజియంను విద్యార్థులకు, సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా పూర్తి చేసిన అధునీకరణ పనుల పై సంతృప్తి వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ అన్ని రకాల వసతి సౌకర్యాలతో నూతనంగా అధునీకరించిన సైన్స్ మ్యూజియం ను సందర్శకులకు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. మ్యూజియంను ​పునఃప్రారంభానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

సైన్స్ మ్యూజియంకు వచ్చే విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగేలా డిస్‌ప్లే గ్యాలరీ బోర్డులను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలను మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story