Karimnagar: కరీంనగర్‌లో ప్రభుత్వ సభలు.. జూన్ 4 నుండే మొదలు!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో జూన్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేక సభలను నిర్వహించనుంది.
Karimnagar: కరీంనగర్‌లో ప్రభుత్వ సభలు.. జూన్ 4 నుండే మొదలు!
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4 నుండి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
జూన్ 4, 6, 8, 10వ తేదీల్లో సభలను నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న పర్యావరణ కార్యక్రమాలకు అదనంగా ఈ సభలు ఉంటాయని తెలిపారు.
ముఖ్యంగా పంట మార్పిడి విధానం, పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల వచ్చే నష్టాలు, నానో యూరియా వినియోగం, మొక్కల పెంపకం, తాగునీటి పరిరక్షణ, వర్షం, వర్షం నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు, పురోగతి తెలియజేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఈ గ్రామ సభలను విజయవంతం చేయాలని సూచించారు.




