Karimnagar: అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్

Karimnagar: కరీంనగర్ జిల్లాలో అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణపై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్ అశ్విని వాకడే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Sept 2026 6:19 PM IST
Karimnagar
X

Karimnagar: అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్

కరీంనగర్ : జిల్లాలోని అటవీ భూములు, వన్యప్రాణుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే.. సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అటవీ శాఖ, వన్యప్రాణుల ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో అటవీశాఖ భూములు ఉన్నాయని.. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయాలన్నారు. డీఎఫ్ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి.. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

జిల్లాకేంద్రంలోని బైపాస్ వద్ద ఎన్టీఆర్ బొమ్మ సమీపంలో అటవీ శాఖ చెక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీశాఖ ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతే మైనింగ్ అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇరుకుల్ల ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో అటవీ శాఖ భూములకు సరిహద్దులు నిర్ణయించాలని పేర్కొన్నారు.

సైదాపూర్ మండలం రాయికల్ వాటర్ ఫాల్స్ కు జన సందడి పెరుగుతున్నందున.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు కోరారు.

వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ వివరించారు. ఎల్ఎండీకి వివిధ రకాల పక్షులు వస్తుంటాయని.. పేర్కొన్నారు. డ్యాంలో మత్స్యకారులు.. చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలతో పక్షులకు నష్టం కలుగుతుందన్నారు. దీనిపై మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కోరుతామని డీఎఫ్ఓ సత్యనారాయణ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎఫ్ఆర్ ఓలు షోకత్ హుస్సేన్, లత తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN