Karimnagar: కరీంనగర్లో TS ఇన్సూరెన్స్ హబ్‌ను ప్రారంభించిన సునీల్ రావు
Karimnagar: కరీంనగర్ ముకరంపురలో నూతన 'TS ఇన్సూరెన్స్ హబ్'ను బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. అన్ని వాహనాలకు బీమా సేవలు లభిస్తాయని చెప్పారు.
Karimnagar: కరీంనగర్లో TS ఇన్సూరెన్స్ హబ్‌ను ప్రారంభించిన సునీల్ రావు
Karimnagar: కరీంనగర్ నగరంలో వాహనదారులకు మెరుగైన మరియు సులభమైన బీమా సేవలు అందించే లక్ష్యంతో ముకరాంపుర లోని పరివార్ బేకరి లేన్ లో ఏర్పాటుచేసిన "TS ఇన్సూరెన్స్ హబ్" కార్యాలయ ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన ఇన్సూరెన్స్ హబ్ నిర్వాహకులు షాకీర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ బైక్‌లు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ మరియు కమర్షియల్ వెహికల్స్ అన్నింటికీ సమగ్రమైన బీమా సేవలు ఇక్కడ లభిస్తున్నాయని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ టూ వీలర్‌కు రూ 850 నుండి 2,500 వరకు, ఫోర్ వీలర్‌కు రూ. 2,500 నుండి 20,000 వరకు అందుబాటులో ఉందని.. వాహన మోడల్ మరియు ఐడివి విలువను బట్టి పూర్తిస్థాయి బీమా సేవలు అందించబడతాయని అన్నారు. కస్టమర్లు తమ ఆర్సి కార్డును వాట్సాప్ ద్వారా పంపి వెంటనే కొటేషన్ పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీద్ హుస్సేన్, ఇబ్రహీం, పడాల అజయ్ శ్రీజ, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




