Karimnagar: ఎలగందుల శివారులో జూద స్థావరం గుట్టురట్టు
Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎలగందుల గ్రామ శివారులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూద స్థావరంపై దాడి చేశారు.
Karimnagar: ఎలగందుల శివారులో జూద స్థావరం గుట్టురట్టు
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎలగందుల గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూదం స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.
దాడిలో రూ.10,100 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలు చట్టవిరుద్ధమైన జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కరీంనగర్ పోలీసులు సూచించారు.
Next Story




