Karimnagar: అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

Karimnagar: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారంలో టాస్క్‌ఫోర్స్ దాడి చేసి 475 జిలెటిన్ స్టిక్స్, 3000 మీటర్ల వైర్, 2 కంప్రెసర్ ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుంది.

Velpugonda Ravikumar, Karimnagar
Published on: 17 Oct 2026 5:13 PM IST
Karimnagar
X

Karimnagar: అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

కరీంనగర్: విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు గుర్తించి రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన వేముల భూమయ్య (45)ను అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ (3 బండిళ్లు), రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు (నంబర్లు: TS 02 UC 2690, TG 02 T 0082) స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, కంప్రెసర్ ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సైదాపూర్ పోలీసులకు అప్పగించారు.

Velpugonda Ravikumar, Karimnagar

Velpugonda Ravikumar, Karimnagar