Karimnagar: ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ!
Karimnagar: కరీంనగర్ ఎస్జీఎఫ్ అండర్-19 అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించి సత్తా చాటిన తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు. విజేతలకు యాజమాన్యం అభినందనలు.
Karimnagar: ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ!
Karimnagar: ఎరస్ట్వైల్ కరీంనగర్ జిల్లా పరిధిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-19 జూనియర్ కళాశాలల క్రీడా పోటీల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.
ప్రాంతీయ క్రీడా పాఠశాల, ఎల్.ఎం.డి., కరీంనగర్ వేదికగా నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలలో తేజాస్ విద్యార్థులు, CH. భీమేష్ జావెలిన్ త్రోలో ప్రథమ స్థానం, హైజంప్‌లో ద్వితీయ స్థానం,జె. సాయి కృష్ణ డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం, బి. నాగరాజు, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం, సాధించాలని తేజస్ జూనియర్ కళాశాలల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు.
తేజస్ జూనియర్ కళాశాలల చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, పట్టుదల మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తేజస్ జూనియర్ కళాశాల నిరంతరం ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు.
విద్యార్థులు క్రీడల్లో మరింత కృషి చేసి జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించి తేజస్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చి పథకాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ సతీష్ రావు, డైరెక్టర్ మౌనికారావు, కళాశాల ప్రిన్సిపాల్ కిషన్ రెడ్డి, కళాశాల పిఈటిలు వారికి అభినందనలు తెలిపారు.




