Karimnagar: మన్నెంపల్లిలో ఉద్రిక్తత.. పాత గ్రామపంచాయతీ భవనం కూల్చివేత!

Karimnagar: కరీంనగర్ మన్నెంపల్లిలో నోటీసులు లేకుండా పాత జీపీ భవనం కూల్చివేతను అడ్డుకున్న సర్పంచ్ భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 19 Sept 2026 11:26 AM IST
Karimnagar
X

Karimnagar: మన్నెంపల్లిలో ఉద్రిక్తత.. పాత గ్రామపంచాయతీ భవనం కూల్చివేత!

Karimnagar: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఈ రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పాత గ్రామపంచాయతీనీకూల్చేందుకు తమకు ఆర్డర్స్ ఉన్నాయంటూ అధికారులు రాగా పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు.

అర్ధరాత్రి నుండి నడిచిన హైడ్రామా నడుమ ఉదయం పోలీసులు ఎంట్రీ ఇచ్చి బలవంతంగా పలకవర్గాన్ని అడ్డుకుని జేసీబీ తో పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చుతున్నారు.

నోటీసులు ఇవ్వలేదని..

నోటీసులు ఇవ్వకుండా కుల్చడానికి రావడంతో సర్పంచ్ పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. ప్రొసీజర్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ సునీత ఆరోపించారు.

బలవంతంగా అరెస్ట్..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులతో భారీ బందోబస్తు నడుమ వచ్చిన అధికారులు సర్పంచ్ సునీత భర్త పొన్నం అనిల్ గౌడ్ ను బలవంతంగా అరెస్ట్ చేశారు.

అధికారులు పాలకవర్గానికి వాగ్వాదం.

కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ అధికారులు వాదించగ, తమకు కూడా గతంలో కూల్చవద్దని గ్రామపంచాయతీ ఇతర అవసరాలకు పాత కార్యాలయము వాడుకోవాలని గతంలో చెప్పినట్లు పాలకవర్గం వివరించారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU