Thimmapur: కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయండి: బీజేపీ!
Thimmapur: కరీంనగర్లో బీజేపీ తలపెట్టిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
Thimmapur: కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయండి: బీజేపీ!
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గుజ్జ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక విదేశీ శక్తులతో చేతులు కలిపి పనికిమాలిన రాజకీయాలు చేస్తోందని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయితుడుచుపెట్టుకుపోయిన కాంగ్రెస్, దిక్కుతోచని స్థితిలోనే బీజేపీపై చిల్లర రాజకీయాలతో బురదజల్లే కుట్రలు చేస్తోందన్నారు. దేశంలో అశాంతిని రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు బుద్ధి చెప్పేందుకే ప్రజలు, యువత భాగస్వామ్యంతో కరీంనగర్లో ఈ మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, పార్టీ శ్రేణులంతా కష్టపడి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతుందనిబీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఎద్దేవా చేశారు .దేశంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కి మనుగడ కష్టంగా మారిందని, అందుకే ప్రజల దృష్టిని మరలించడానికి రకరకాల డ్రామాలు ఆడుతోందన్నారు. కాంగ్రెస్ పనికిమాలిన రాజకీయాలు ప్రజలు గ్రహిస్తున్నారని , రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు తీవ్ర గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బిజెపిజిల్లా కార్యవర్గ సభ్యులు.మువ్వరపు సంపత్ , బూట్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టె ముక్కుల తిరుపతి రెడ్డి, వేల్పుల ఓదేలు యాదవ్ , బొనాల మోహన్, కొయ్యడ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ , ఎర్రోజు లక్ష్మణ్ఎం రాజేష్, ఎ. స్వామి, శ్రీను, జాడి రాజు, మహేందర్ రెడ్డి, రవికుమార్, ప్రణయ్, సుగుణాకర్, అజయ్ ,నరేష్, కామెరా వెంకటేష్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




