Karimnagar: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: తిమ్మాపూర్ సీఐ అనిల్!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బర్ల అనిల్ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రథమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Karimnagar: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: తిమ్మాపూర్ సీఐ అనిల్!
కరీంనగర్: శాంతి భద్రతల పరిరక్షణ తమ ధ్యేయమని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్ల అనిల్ తెలిపారు. ఈరోజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
ప్రజలతో మమేకమై పనిచేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా ఉంటామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన సిఐ అనిల్ కు. ఎల్ఎండి ఎస్ఐ అరుణ్ తో పాటు సిబ్బంది పుష్పగుచ్చాలు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.




