Karimnagar: తిమ్మాపూర్లో బైక్పై వెళ్తున్న మహిళ మెడలో పుస్తెల చోరీ!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై బైక్పై వెళ్తున్న చుంచు లక్ష్మి మెడలోని అర తులం బంగారు పుస్తెలు, గుండ్లను దుండగులు లాక్కెళ్లారు. ఎల్ఎండీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karimnagar: తిమ్మాపూర్లో బైక్పై వెళ్తున్న మహిళ మెడలో పుస్తెల చోరీ!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎల్ఎండి పోలీస్ స్టేషన్ సమీపంలో రాజీవ్ రహదారిపై బైక్ పై వెళ్తుండగా చుంచు లక్ష్మీ మెడలో తాడును లాక్కున్నట్లు బాధితురాలు తెలిపింది. మండలంలోని రామకృష్ణ కాలనీలోని ఉపగ్ర హోం లో ఉంటున్న శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు బైక్ పై వెళ్తుండగా తిమ్మాపూర్ లోని ఓ పత్రిక కార్యాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మెడలో పుస్తెలతాడు లాగారు. రోల్డ్ గోల్డ్ తాడు ఆమె మెడలో ఉండగా పుస్తెలు గుండ్లు ఎత్తుకెళ్లారు.
సుమారు అర తులం బంగారు పుస్తెలు గుండ్లు చోరీ అయినట్లు బాధితురాలు లక్ష్మీ తెలిపింది. మహాత్మా నగర్ లోని ఓ డిఫెన్స్ కళాశాలలో తన కుమారుడు ఉండగా అతనిని చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు లక్ష్మి పేర్కొంది. బాధితురాలు సమాచారం మేరకు ఎల్ఎండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.




