Thimmapur: ప్లాస్టిక్ నిషేధంపై నేతాజీ యూత్ అవగాహన

Thimmapur: నేతాజీ యూత్ అవగాహన సదస్సులో భాగంగా 200 స్టీల్ ప్లేట్లు వితరణ చేసిన దాత అడిచెర్ల సత్యనారాయణ.

ANJANEYULU, MANAKONDURU
Published on: 31 May 2026 6:57 PM IST
Thimmapur
X

Thimmapur: ప్లాస్టిక్ నిషేధంపై నేతాజీ యూత్ అవగాహన

తిమ్మాపూర్: ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి,నీరు, గాలిని కలుషితం చేయడంతో పాటు పశువులు, పక్షులు, ఇతర జీవులకు కూడా ప్రమాదకరంగా మారుతున్నా నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో మహాత్మనగర్ నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిచెర్ల సత్యనారాయణ తన వంతు సహాయంగా 200 స్టీల్ ప్లేట్లను అందజేసి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. అలాగే మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి సహకారం అందించారు. భవిష్యత్తులో మరింత మంది గ్రామస్తులు, దాతలు భాగస్వాములు అయితే మహాత్మనగర్‌ను పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధ గ్రామంగా తీర్చిదిద్దవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నేతాజీ యూత్ సభ్యులు , సర్పంచ్ పొన్నాల సంపత్, ఉపసర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి,గంగరాజం, అడిచెర్ల కనకమల్లు, కేతిరెడ్డి సింగారెడ్డి, అడిచెర్ల తిరుపతి, మడుపు శ్రీనివాస్ రెడ్డి, అడిచెర్ల సత్యనారాయణ, ఎడ్ల అంజిరెడ్డి,వార్డ్ సభ్యులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story