Karimnagar: కరీంనగర్ టీఎన్జీవోల జిల్లా కార్యవర్గ సమావేశం

Karimnagar: కరీంనగర్‌లో టీఎన్జీవోల జిల్లా కమిటీ సమావేశం. ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా, హెల్త్ కార్డుల పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంఘం నేతలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 18 July 2026 5:36 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ టీఎన్జీవోల జిల్లా కార్యవర్గ సమావేశం

కరీంనగర్: తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ చర్యలు తదితర పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే చర్యలు చేపట్టడం, అలాగే ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందుబాటులోకి తీసుకురావడం పట్ల తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా హెల్త్ కార్డు అమలులో మరింత మెరుగుదల అవసరమని సమావేశం అభిప్రాయపడింది. హెల్త్ కార్డు ద్వారా ఆసుపత్రుల్లో చేరే (ఇన్‌పేషెంట్) సేవలతో పాటు, ఔట్‌పేషెంట్ సేవలను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని, వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా అవసరమైన బ్రాండెడ్ మందులను ఉద్యోగులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవల తెలంగాణ ఎన్జీవోల సంఘం నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన సంఘ నాయకులు, సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

వారు తమ విధుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, సంఘానికి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు.అలాగే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఇతర ఆర్థిక, సేవా సంబంధిత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని సమావేశం అభిప్రాయపడింది. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యలన్నీ దశలవారీగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వంతో సమన్వయం వంటి అంశాల్లో తెలంగాణ ఎన్జీవోల సంఘం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగుల గొంతుకగా నిలుస్తున్న “ ఉద్యోగుల గోంతుక” పత్రిక బలోపేతం కోసం ప్రతి కార్యవర్గ సభ్యుడు తప్పనిసరిగా రూ.5,000/- లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్ పొందాలని కోరారు. అలాగే రూ.2,000/- మెంబర్‌షిప్ తీసుకున్న సభ్యులకు మూడు సంవత్సరాల పాటు పత్రికను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తమ తమ విభాగాల్లోని ఉద్యోగులతో సభ్యత్వ నమోదు చేపట్టి, తాము కూడా తప్పనిసరిగా మెంబర్‌షిప్ పొందాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంలో విశేష కృషి చేసి, ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కి మరియు ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ కి తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా తరఫున సమావేశం ఏకగ్రీవంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల జిల్లా సంఘం కార్యదర్శి సంగేం లక్ష్మణరావు జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మహిళా చైర్ పర్సన్ ఇరుమల్ల శారద పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్ గంగాధర అధ్యక్షులు కామ సతీష్ మరియు కార్యదర్శి గిరిధర్ రావు జిల్లా నాయకులు గంగారపు రమేష్ గౌడ్ ఓంటెల ప్రసాద్ రెడ్డి భీం రావ్ నగేష్ గౌడ్ శంకర్ యాదవ్ సుధాకర్ రెడ్డి కయ్యం శ్రీనివాస్ దోంత రాజు సునీత శైలజ సుస్మిత విజయ లక్ష్మి కరుణ అస్గర్ అలీ లవకుమార్ శంషుద్దీన్ బల్బీర్ సింగ్ కమలాకర్ రూరల్ కార్యదర్శి కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ మొర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story