Karimnagar: డంప్ యార్డ్ సమస్య మూడు పార్టీల పాపమే గుంజపడుగు హరిప్రసాద్

Karimnagar: కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై మండిపడిన తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్. డంప్ యార్డ్ తరలింపుకే డిమాండ్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Nov 2026 7:22 PM IST
Karimnagar
X

Karimnagar: డంప్ యార్డ్ సమస్య మూడు పార్టీల పాపమే గుంజపడుగు హరిప్రసాద్

కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థలో ఏళ్ల తరబడి అధికారాన్ని అనుభవించిన మూడు రాజకీయ పార్టీలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేక పోయాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ డంపింగ్ యార్డ్ ‌సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, మొన్నటి వరకు నగర పాలక సంస్థలో అటు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ ప్రజల ఆరోగ్యం విషయం పట్టింపు లేదని అన్నారు . కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు డంప్ యార్డ్ తరలింపు విషయంలో ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేశారు.

ఎన్నికలకు‌ ముందు ఒక మాట ఎన్నికల తరువాత మరో మాట చెప్పడం ఈ మూడు పార్టీల నాయకులకు‌ అలవాటుగా మారిందని వీళ్ళు కరీంనగర్ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలి. ప్రజలు దుర్వాసనతో, కాలుష్యంతో, అనారోగ్య భయాలతో ఇబ్బందులు పడుతున్న వీరికి ఎందుకు ప్రజలు గుర్తుకు రావడం లేదు.

డంప్ యార్డ్ సమస్యపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు, ప్రజలకు మీరు ముగ్గురు ప్రజా ప్రతినిధులుగా మీరు‌ చూపించే పరిష్కారం ఎమిటో కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలి. చెత్త రీసైక్లింగ్ పేరుతో కోట్ల రూపాయలు ప్రజల డబ్బులను దోపిడీ చేసేందుకు అవకాశంగా మార్చు కోవాలని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి కొందరి ప్రయోజనాలకు వేదికగా మార్చడాన్ని తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదు.

గతంలో బీఆర్ఎస్ పాలనలో కీలకంగా ఉన్న వ్యక్తులు నేడు బీజేపీ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యపై తీసుకున్న చర్యలు శూన్యం. స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ డంప్ యార్డ్ కు వెళ్ళి ప్రజలకు ఇచ్చిన హామీల కూడ అమలుకు నోచుకోలేదు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహార్‌లాల్ కట్టర్ ను తెచ్చిన డంప్ యార్డ్ సమస్యకు పరిష్కారం దొరక లేదని. ఈ మూడు పార్టీల నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం విమర్శలు పక్కనపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి. కరీంనగర్ ప్రజలకు‌‌ కావలసింది రీసైక్లింగ్ కాదు. డంప్ యార్డ్ తరలింపు ద్వారా శాశ్వతమైన పరిష్కారం కావాలి.

కరీంనగర్ ప్రజలు మీకు ఓట్లు వేసింది మీ రాజకీయ ఆధిపత్యం కోసం కాదని ఆరోగ్యంతో కూడిన అభివృద్ధి‌ కొరకు మిమ్మల్ని ఎన్నుకున్నారని ప్రజల ఓట్లతో గెలిచి పదవులు అనుభవిస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తే ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం తప్పదని డంప్ యార్డ్ సమస్య పరిష్కారమయ్యే వరకు తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా కమిటీ సభ్యురాలు కొర్మి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి శ్రీనివాస్, జిల్లా మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి పోన్నం శిరీష, జిల్లా M'BC అద్యక్షా కార్యదర్శులు శ్రీరాముల రమేష్, దీటి‌ రమేష్, ‌బిసి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేణి రాజేందర్, జిల్లా సీనియర్ నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్, ‌యువజన విభాగం నాయకులు రాగతి సందీప్, ‌నునుగొండ పవన్ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR