Karimnagar: యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసంపై సమగ్ర విచారణ జరపాలి
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో అభివృద్ధి పేరుతో వందలాది చెట్ల నరికివేత, అక్రమ మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్.
Karimnagar: యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసంపై సమగ్ర విచారణ జరపాలి
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అక్రమంగా మట్టి తరలింపు వందలాది చెట్లు నరికివేతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేశారు. కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీలో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు, వందలాది చెట్ల నరికివేత, వన్యప్రాణుల సహజ ఆవాసాల విధ్వంసంపై తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యను అందించాల్సిన విశ్వవిద్యాలయంలో ప్రకృతి విధ్వంసానికి వేదికగా మారడం అత్యంత దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
యూనివర్సిటీ ప్రాంగణంలో 10 అడుగులకు పైగా లోతుతో మట్టిని తవ్వుతూ దాదాపు 500.కు పైగా చెట్లను వేర్లతో సహా తొలగించి ప్రకృతి సంపదను ధ్వంసం చేయడానికి వారికి అనుమతులు ఎవరు ఇచ్చారు.చెట్లను నరికివేయడమే కాదు వాటిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు దీనిని తీవ్రంగా పరిగణించాలి నరికివేసిన కలప చెట్లతో వచ్చిన విలువ మరియు మట్టి తరలింపు ద్వార వచ్చిన డబ్బులు ఎవరి జేబులోకి పోయినాయో వాటిని సొమ్ము చేసుకోవడంలో ఎవరి పాత్ర ఉందో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం కూడా అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో నెమళ్లు, కుందేళ్లు, వివిధ రకాల పక్షులు, ఇతర వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న పచ్చదనాన్ని ధ్వంసం చేయడం వల్ల జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ అంటే విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే దేవాలయమే కానీ ప్రకృతిని నాశనం చేసే వికృతి చేష్టలకు వేదిక కాదు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై పాఠాలు చెప్పే విశ్వవిద్యాలయంలోనే చెట్లను నరికివేయడం, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేయడం పాలకులకు అలవాటు మారిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.




