Karimnagar: కరీంనగర్‌లో భారీగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్!
Karimnagar: కరీంనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్. 2.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించిన కొత్తపల్లి పోలీసులు.
Karimnagar: కరీంనగర్‌లో భారీగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్!
Karimnagar: రేకుర్తి కి చెందిన మహమ్మద్ మున్న మరియు మహమ్మద్ షారుక్ లు గత కొంతకాలంగా మహారాష్ట్ర లోని మరియు ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తక్కువ ధరకు కొని కరీంనగర్ తీసుకు వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి సేవిస్తున్న విద్యార్థులకు, ఇతరులకు అమ్ముతూ అక్రమార్జన చేస్తున్నారు. ఇదే క్రమంలో 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ కి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలోకి 20,000/- రూపాయల చొప్పున 2.200 KG ల గంజాయి కొని, రేకుర్తికి తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి కిలో గంజాయికి 50,000/- రూపాయల చొప్పున అమ్మడానికి సిద్ధం చేశారు.
ఒక చేతి సంచిలో అట్టి 2.200 KGల గంజాయిని తీసుకొని రేకుర్తిలోని సమ్మక్క గద్దెల వద్ద కెనాల్ కాల్వ వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా, కొత్తపల్లి పోలీసులు ఎస్సై సాంబమూర్తి తన సిబ్బంది యుక్తంగా పెట్రోలింగ్ చేయుచుండగా, పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి వారిని పట్టుకుని, విచారించగా సంచిలో ఉన్న రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు. తదుపరి పంచుల సమక్షం లో పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి గంజాయి మరియు సెల్ ఫోన్లు సీజ్ చేసి, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి SHO శ్రీ బిల్లా కోటేశ్వర్ గారు తెలిపినారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకున్న ఎస్ఐ సాంబమూర్తిని HC హరి కేశవ్, పరశురాములు కానిస్టేబుల్ శ్రీనాథ్, వెంకటేష్, శ్రీనివాస్, శివ లను సిఐ గారు అభినందించారు.




