Karimnagar: కరీంనగర్‌లో భూ కబ్జాదారుల గుట్టురట్టు.. ఆరుగురు సభ్యుల ముఠా కటకటాల్లోకి!

Karimnagar: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లు రెడీ! కరీంనగర్ పోలీసుల దాడుల్లో దొరికిపోయిన కిన్నెర మల్లవ్వ ముఠా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 9:22 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో భూ కబ్జాదారుల గుట్టురట్టు.. ఆరుగురు సభ్యుల ముఠా కటకటాల్లోకి!

కరీంనగర్: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గల కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చాలా చాకచక్యంగా భూకబ్జాదారులను అరెస్టు చేసే రిమాండ్ కి తరలించినారు.

కరీంనగర్ కు సంబంధించిన కొంతమంది ఒక మూటగా ఏర్పడి ఓపెన్ ప్లాట్స్ కనిపిస్తే వాటికి డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమ్మకానికి పెడుతున్నారు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన సంఘటన. కరీంనగర్ పద్మనగర్ నివాసి కిన్నెర మల్లవ్వ, గన్నేరువరం మండలం చీమలకుంట గ్రామానికి చెందిన భామండ్ల రవీందర్, కరీంనగర్ మార్కండేయ నగర్ కు చెందిన లోకినీ పోచయ్య, లోకిని ఆదిత్య, లోకిని రాజమ్మ, అనుముల బాలయ్య, ఒక ముఠాగా ఏర్పడి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేస్తూ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నట్లు కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి తెలిపారు.

ఖాళీ స్థలం కనిపిస్తే నకిలీ డాక్యుమెంట్లు అమ్మకం..

పైన తెలిపిన వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుగుతూ ఖాళీగా ఉన్న ప్లాట్స్ లను గుర్తించి మొదట అట్టి ప్లాట్స్ లను టార్గెట్ చేస్తారు. అట్టి ఓనర్స్ వివరాలు తెలుసుకొని అట్టి వివరాల ద్వారా అట్టి భూమి పై నకిలీ పత్రాలు సృష్టించి ముందుగా వారి ముఠాలో గల ఒకరి పై రిజిష్ట్రేషన్ చేసుకొని ఆ తరువాత అట్టి డాక్యుమెంట్స్ తో ముఠాలోని మరొకరి పేరు పై మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ , తద్వారా అట్టి ప్లాట్స్ కి లింకు డాక్యుమెంట్లు సృష్టిస్తారు. ఇలా తయారుచేసిన నకిలీ లింక్డ్ డాక్యుమెంట్లతో అమాయకులకి భూములు అమ్ముకొని వచ్చిన డబ్బులను పంచుకోంటారు. ఇదే విధంగా కరీంనగర్లోని పద్మనాగర్ ఏరియాలో సర్వే నెంబర్. 212 లో గల 242 చదరపు గజాల స్థలమును నిందితులు పై విధంగానే నకిలీ లింక్డ్ డాక్యుమెంట్లతో కబ్జా చేసి వేరే వ్యక్తులకు అమ్మినారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలియడంతో నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story