Gangadhara: కాలం మారినా చెదరని స్నేహం.. కరీంనగర్ జిల్లాలో స్కూల్ రీయూనియన్ సందడి!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో 2005-06 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 17 May 2026 9:42 PM IST
Gangadhara
X

Gangadhara: కాలం మారినా చెదరని స్నేహం.. కరీంనగర్ జిల్లాలో స్కూల్ రీయూనియన్ సందడి!

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం ఉప్పరమల్యాల జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో 2005-06 ఎస్‌ఎస్‌సి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాల అనంతరం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతో కాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి దశలో జరిగిన అనుభవాలు, తరగతి గదుల్లో జరిగిన సరదా సంఘటనలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు.

పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, “కాలం మారినా స్నేహబంధాలు ఎప్పటికీ చెదరవు. ఇలాంటి సమ్మేళనాలు మన మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ పాఠశాల రోజుల జ్ఞాపకాలు జీవితాంతం ప్రత్యేకంగానే నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆహ్లాదకర వాతావరణంలో సమయాన్ని గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా నిర్వాహక కమిటీ సభ్యులు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story