Karimnagar: నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం: అర్బన్ డీసీసీ అధ్యక్షుడు!
Karimnagar: కొత్తపల్లి 17, 18వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన 6 ఇందిరమ్మ ఇళ్లను అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ప్రారంభించి గృహప్రవేశాలు చేయించారు.
Karimnagar: నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం: అర్బన్ డీసీసీ అధ్యక్షుడు!
కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లి 17 మరియు 18వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన 6 ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ కార్పొరేటర్ గారు ప్రారంభించారు.
కొత్తపల్లికి చెందిన లబ్ధిదారులు వేముల రేఖ, జంగాలపల్లి లింగేష్, బీరయ్య, వోడ్నాల అన్నపూర్ణ, కొలిపాక శంకర్, ఎడ్ల అంజయ్య తదితరుల ఇళ్లను తోటి కాంగ్రెస్ నాయకులతో కలిసి గృహప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ "కొత్తపల్లి పట్టణంలోనే ఇప్పటికి సుమారు 120 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి, అందులో 50కి పైగా గృహప్రవేశాలు జరిగాయి. రాబోయే రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గానికి 1500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి, దీనివల్ల కొత్తపల్లిలో ఇంకా అనేకమంది నిరుపేద లబ్ధిదారులకు లాభం చేకూరుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, 18వ డివిజన్ అధ్యక్షులు పోన్నం శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు చిలుక హనుమంతరెడ్డి గారు, గున్నాల రమేష్ గారు, దుబ్బాసి కుమార్ గారు, మడుపు మోహన్ గారు, బొమ్మ ఈశ్వర్ గారు, తుమ్మ ప్రతాప్ రెడ్డి గారు, జేరిపోతుల వాసు గారు, వికార్ అహ్మద్ ఖాన్ గారు, సంఘం మునీందర్ గారు, కుతటి శ్రీనివాస్ గారు, భూస వీరేశం గారు, రాపర్తి రాజు గారు, బైరి మహేష్ గారు, పొన్నం భూమా గౌడ్, కత్తి సత్యం గారు తదితరులు పాల్గొన్నారు.




