Vemulawada: శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ బసవ రెడ్డి!
Vemulawada: వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ జి. బసవ రెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Vemulawada: శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ బసవ రెడ్డి!
Vemulawada: వేములవాడ (రాజన్న సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ శ్రీ జి. బసవ రెడ్డి గారు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన ఎస్పీ గారికి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పిఆర్ఓ పెరిక శ్రీనివాస్,ఆలయ పర్యవేక్షకులు నరేందర్ సీనియర్ అసిస్టెంట్ నక్క తిరుపతి, ఆలయ ఉద్యోగులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.




