Karimnagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు.. ఈఆర్ఓ ప్రఫుల్ దేశాయ్

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై కరీంనగర్ నియోజకవర్గ ERO ప్రఫుల్ దేశాయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 8 July 2026 8:38 AM IST
Karimnagar
X

Karimnagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు.. ఈఆర్ఓ ప్రఫుల్ దేశాయ్

కరీంనగర్: ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పని చేస్తుందని కమీషనర్ (ఈఆర్ఓ) ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్ భాగస్వాములయ్యారు.

కార్పోరేషన్ పరిధిలోని తన నివాసంలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారంలో స్వయంగా నమోదు చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారికి అందించారు. ప్రతి ఓక్కరు బిఎల్ఓ అందించిన ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారంలో స్వయంగా ఎవరికి వారు క్లుప్తంగా వివరాలను నమోదు చేసి... తిరిగి అందించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఓటర్ల సవరణ జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియతో పాటు మరణించిన వారి పేర్లను తొలగించడం, ఒకే ఇంటి నంబరుపై ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియకు ప్రతి ఒక్కరు భూత్ లెవల్ అధికారులకు సహాకరించి... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి యువతీ యువకులు ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story