Karimnagar: ఘనంగా జమ్మికుంట 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ జన్మదిన వేడుకలు

Karimnagar: జమ్మికుంట పట్టణంలో 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు ఘనంగా నిర్వహించారు. శివాలయంలో అన్నదానం చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 1 Sept 2026 6:48 PM IST
Karimnagar
X

Karimnagar: ఘనంగా జమ్మికుంట 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ జన్మదిన వేడుకలు

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంపెల్లి అన్వేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒగ్గు రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఒడెతల ప్రణవ్ బాబు ఆశయాల మేరకు పార్టీని బలోపేతం చేస్తూ, వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఒగ్గు రమేష్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దిద్ది రాము, పొన్నగంటి విష్ణు, యాట్ల సునీత, అశోక్, మాచర్ల రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు భాగ్యతో పాటు ముస్కీ వీర్రాజు, కృష్ణ,పుల్లూరి ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story