Jammikunta: జమ్మికుంట వానల కోసం గ్రామ దేవతలకు మహిళల మొక్కులు

Jammikunta: వర్షాభావంతో అల్లాడుతున్న రంగమ్మపెల్లి. వానదేవుడు కరుణించాలని 200 మంది మహిళలతో గ్రామ దేవతలకు నీలాభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు.

GANESH, JAMMIKUNTA
Published on: 17 July 2026 3:39 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట వానల కోసం గ్రామ దేవతలకు మహిళల మొక్కులు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రంగమ్మపెల్లి గ్రామంలలో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు అందుకే గ్రామస్తులంతో కలిసి మహిళలందరూ ఏకధాటిగా ఉదయాన్నే ఇంటికొక బిందెడు నీళ్లులతో గ్రామంలో ఉన్న డప్పు చప్పులతో ఎల్లమ్మ తల్లి భూలక్ష్మి బీరన్న పోచమ్మ శివాలయం ఆంజనేయస్వామి ఆలయాలలో కులదైవాలకు నీలాభిషేకం చేసి పాటలు పాడుతూ..

వర్షాలు పడాలని మహిళలంతా కలిసి గ్రామ దేవతలకు పూజలు చేసి పాడిపంటలు మంచిగా ఉండాలని వర్షాలు లేక ఇప్పటికే అల్లాడుపోతున్నామని పంటలు మంచిగా పండాలని బావిలో నీళ్లు చెరువులో నీళ్లు రావాలని వానదేవుడు కరుణించి మాకు ఈసారైనా వర్షాలు పడాలని వనదేవతలకు నీలాభిషేకం చేసి 200 మంది మహిళలంతా కలిసి ఆట పాటలతో మొక్కులు చెల్లించుకున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story