Karimnagar: కెనాల్‌లో గల్లంతైన యువకుడు మృతి: ఎల్ఎండీలో శవం లభ్యం

Karimnagar: కరీంనగర్ మల్కాపూర్ క్రాస్ రోడ్డు కెనాల్‌లో వినాయక నిమజ్జనం చేస్తూ గల్లంతైన యువకుడు తాండ్ర రుద్ర మృతదేహం ఎల్ఎండీ వద్ద లభ్యమైంది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Sept 2026 6:32 PM IST
Karimnagar
X

Karimnagar: కెనాల్‌లో గల్లంతైన యువకుడు మృతి: ఎల్ఎండీలో శవం లభ్యం

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర రుద్ర అనే యువకుడు మల్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కెనాల్‌లో వినాయక విగ్రహ నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు.

కెనాల్‌లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రుద్ర నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. దీంతో యువకుడి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు, స్థానికులు, సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్ఎండీ (లోయర్ మానేరు డ్యామ్) ప్రాంతంలో రుద్ర మృతదేహం లభ్యమైంది.

విషయం తెలుసుకున్న కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేషంతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసే ప్రక్రియను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.

పోలీసులు, స్థానికులు, సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి....పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీలైనంత తొందరగా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని మేయర్ అధికారులను ఆదేశించారు

అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ మృతుడు రుద్ర కుటుంబ సభ్యులను పరామర్శించి, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి...బరోసా కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం మృతుడు తాండ్ర రుద్ర కుటుంబానికి సహాయ సహకారాలు, చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ సంబంధిత అధికారులకు సూచించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN