Karinmagar: కరీంనగర్‌లో పారిశుధ్యంపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్ష

Karinmagar: స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో కరీంనగర్ నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యమని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 April 2026 8:06 PM IST
Karinmagar
X

Karinmagar: కరీంనగర్‌లో పారిశుధ్యంపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్ష

Karinmagar: నగర పారిశుధ్యంను మరింత మెరుగుపరిచి " స్వచ్చ్ సర్వేక్షన్" 2026 లో ఉత్తమ ర్యాంకు సాధించాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం రోజు నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతి లో పారిశుధ్య విభాగం సూపర్ వైజర్లు, ఎస్సైలు, జవానులు, వార్డు ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మెప్మా సివో ఆర్పీలతో సమావేశం జరిగింది.

" స్వచ్చ్ సర్వేక్షన్ 2026" ఉత్తమ ర్యాంకింగ్ కోసం నగర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పారిశుద్ధ్యం మెరుగు, 100 సెక్రిగేషన్, కంపోస్టింగ్, డిఆర్ సీసీ, త్రిబులార్, ఎస్టీపి నిర్వాహాణ, సిటీజన్ ఫీడ్ బ్యాక్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వాహాణతో పాటు పారామీటర్ వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్వీయ గణన, ఓటర్ సమగ్ర మ్యాపింగ్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి. దిశా నిర్ధేశం చేశారు. అధికారులు, సిబ్బంది కి పలు సూచనలు చేస్తూ. ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ స్వచ్చ్ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంక్ కోసం, సెల్ప్ ఎన్యూమరేషన్, ఓటర్ల సమగ్ర సవరణ కు వార్డు ఆఫీసర్లు, పారిశుధ్య అధికారులు సిబ్బంది, మెప్మా సివో ఆర్పీలు కృషి చేయాలని ఆదేశించారు.

స్వచ్చ్ సర్వేక్షన్ పారామీటర్లలో మంచి మార్కులు వచ్చేలా. నగరపాలక సంస్థ మెరుగైన ర్యాంకు పొందెలా బాధ్యత వహించాలన్నారు. నగర వ్యాప్తంగా డివిజన్ కార్పోరేటర్లు సమన్వయం, సహకారంతో పారిశుధ్య పరంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డివిజన్ వారిగా మెరుగైన పారిశుధ్య పనులు చేయడంతో పాటు 100 శాతం సెక్రిగేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వార్డు ఆఫీసర్లు, మెప్మా సివో లు ఆర్పీలు, ఎస్సైలు జవాను మీ యొక్క డివిజన్ల వారిగా స్వచ్చ్ సర్వేక్షన్ పై అవగాహన పరుస్తూ. వారిని బాగస్వాములను చేయాలన్నారు. స్వచ్చ్ సర్వేక్షన్ ఫీడ్ బ్యాక్ ప్రతి ఒక్కరి నుండి తీస్కోని పూర్తి స్థాయిలో చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వచ్చ్ సర్వేక్షన్ లో ఎస్ హెచ్ జీ సంఘాల మహిళలు, యువకులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.

నగర స్వచ్చత, హోం కంపోస్టింగ్, డోర్ టూ డోర్ సెక్రిగేషన్ వంద శాతం జరిగేలా వారిని అవగాహన చెయ్యాలన్నారు. డివిజన్ల వారిగా వార్డు ఆఫీసర్లు, ఎస్సైలు జవాను ప్రజలను భాగస్వాములను చేసి రోజు ఒక్క కార్యక్రమాలతో అవగాహన చేయాలని ఆదేశించారు. డీఆర్ సీసీ, ఆర్ ఆర్ ఆర్, ఎస్టీపి నిర్వహణ చేపట్టాలన్నారు. వాహానాలకు వెట్ పేస్టు, సానిటరీ వేస్చ్, డ్రై వేస్టు హాజార్డర్ వేస్టు పార్టేషన్ చెయ్యాలన్నారు. ట్రాక్టర్లకు టార్పాలిన్స్ తప్పని సరిగా ఉండాలని ఆదేశించారు.

జీవీపి పాయింట్ల లో చెత్త పడకుండ చూడటంతో పాటు చెత్త వేసే వారి పై జరిమానాలు విధించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలో లిట్టర్ బిన్స్, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని... ఒక కంపోస్టు ఏర్పాటు కు యజమాన్యంతో చర్చించి... త్వగగా ఏర్పాటు చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. రోడ్ల పై సీఎన్ డి వేస్ట్ లేకుండ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నగరంలోని ప్రజా మరుగు దొడ్లను తనిఖీ చేసి వాటి నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి రిపేర్స్ ఉన్న మరమ్మతు చేయించి... నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంకు సాధించేలా వారు ఆఫీసర్లు, పారిశుధ్య సూపర్ వైజర్లు, ఎస్సైలు, జవానులు, మెప్మా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్వీయ గణన, ఓటర్ మ్యాపింగ్ చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. డివిజన్ల వారిగా ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసేలా వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది చర్యలు తీస్కోవాలన్నారు. ప్రతి ఒక్కరితో స్వీయ గణన చేయించి. జనగణన కు సహాకరించాలని తెలిపారు. నగర వ్యాప్తంగా బిఎల్ఓలు చేస్తున్న ఓటర్ మ్యాపింగ్ కూడ పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు.

అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో పౌరుల భాగస్వామ్యం కీలకమని, ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు."కరీంనగర్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. 2026 స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్‌లో మన నగరం ముందంజలో ఉండేలే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కమీషనర్ సువార్త, డిప్యూటీ కమీషనర్ వేణు, ఎస్ఈ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story